గోమంగిని మండలంగా ఏర్పాటు చేయండి
NEWS Nov 14,2025 11:46 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే గోమంగిని మండలంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అరకు నియోజకవర్గం జీడీపీ పార్టీ కార్యదర్శి చుంచు రాజబాబు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ, పెదబయలు మండలానికి కేంద్రబిందువుగా ఉన్న గోమంగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఆనుకుని ఉన్న 17 పంచాయతీల అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, సంఘాలకు అతీతంగా ప్రజలు గోమంగి మండలం ఏర్పాటుకోసం పోరాటాలు కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. మండలం ఏర్పడితే ఆ ప్రాంతంలో విద్య, వైద్యం, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందుతాయని రాజబాబు పేర్కొన్నారు. ఆ ప్రాంతాలను అనేకసార్లు పర్యటించిన అనుభవంతో అక్కడి అభివృద్ధి అవసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.