గోండ్వానా దండకారణ్య పార్టీ వినతిపత్రం
NEWS Nov 14,2025 11:45 pm
అల్లూరి జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను తీసుకుని గోండ్వానా దండకారణ్య పార్టీ అరకు కార్యదర్శి చుంచు రాజబాబు మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన హుకుంపేట ప్రాంతంలో రోడ్డు ఆక్రమణలు తొలగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. హుకుంపేట ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించాలని, హుకుంపేట తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే ఫిర్యాదులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. అలాగే కొయ్యూరు మండలంలోని యు.చీడిపాలెం పంచాయతీ అంగన్వాడి కార్యకర్త విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పెదబయలు మండలం బొడ్డగొందిలో మంచినీటి కొరతతో పాటు బీటీ రోడ్డు సమస్యలు కొనసాగుతున్నాయని ఫిర్యాదు చేశారు. సమర్పించిన అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని చుంచు రాజబాబు తెలిపారు.