దొంగల బీభత్సం మూడు ఇండ్లలో చోరీ
NEWS Nov 14,2025 11:44 pm
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో దొంగల హల్‌చల్ కలకలం రేపింది. ఒకే రోజు 3 ఇళ్లలో వరుసగా చోరీలకు దొంగలు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న వేముల రమేష్, తగురం తిరుపతి, దివీన్ కుమార్ ఇళ్లలో దొంగలు దాడి చేశారు. 3 ఇళ్లలో కలిసి సుమారు రూ.50 వేల నగదు, తులం మేర బంగారం అపహరించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు.