బుచ్చయ్యపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా జోగా కొండబాబు
NEWS Nov 14,2025 11:43 pm
బుచ్చయ్యపేట మండల వైసీపీ నూతన అధ్యక్షుడిగా జోగా కొండబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పెదమదీనాకు చెందిన కొల్లిమల్ల అచ్చం నాయుడు గత ఆరు సంవత్సరాలుగా మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో అదే గ్రామానికి చెందిన కొండబాబుకు అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తాను శ్రమిస్తానని కొండబాబు తెలిపారు.