టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే కడతా
NEWS Nov 13,2025 08:11 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ బాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విద్యార్థుల ఫీజులు చెల్లించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులను తన వ్యక్తిగత వేతనం నుంచి చెల్లిస్తానని ఆయన స్పష్టం చేశారు. పేద విద్యార్థుల విద్యకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో, అంత్యోదయ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.