కొండా సురేఖను క్షమించిన నాగార్జున
NEWS Nov 13,2025 07:21 pm
కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. నాగార్జున ఫ్యామిలీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు మంత్రి సురేఖ నవంబర్ 13న ఒక పోస్ట్ పెట్టారు. ‘నాగార్జునను కానీ, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారి కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటున్నాను’అని ట్వీట్ లో రాసుకొచ్చారు సురేఖ. ఈ క్రమంలోనే మంత్రిపై దాఖలు చేసిన పరువునష్టం కేసును ఉప సంహరించుకుంటున్నారు నాగార్జున.