ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది
NEWS Nov 13,2025 06:55 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. AI విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా “చనిపోయింది” అంటూ ఆయన ట్వీట్ చేశారు. జ్ఞాపకశక్తిపై ఆధారపడిన చదువులకు విలువ తగ్గిందని, విద్యార్థులు ఏఐని సృజనాత్మకంగా వాడుకోవడం నేర్చుకోవాలన్నారు. కాలేజీలు, స్కూళ్లు తమ బోధన పద్ధతులను మార్చి, పరీక్షల్లో AIని సహాయక సాధనంగా అనుమతించాలని సూచించారు. “ఏఐ మిమ్మల్ని చంపదు, పట్టించుకోదు. దాన్ని వాడలేని వారు భవిష్యత్తులో దాని చేత వాడబడతారు” అని ఆయన హెచ్చరించారు.