జూబ్లీహిల్స్: 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి
NEWS Nov 13,2025 05:36 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. మీడియాకు ప్రత్యేకంగా LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.