మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
NEWS Nov 13,2025 11:59 am
పసిడి ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800లకు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. ఇటీవల ధరలు బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,27,950కి చేరగా.. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,17,300కి ఎగబాకింది.