బాదితులను పరామర్శించిన అధికారులు
NEWS Nov 13,2025 06:58 pm
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పిచ్చికుక్క స్టైరవిహారం చేసి సుమారు 20 మందిని గాయపరిచిన ఘటనలో స్థానిక ఎంపీడీవో శివ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లోవరాజు సిబ్బందితో కలిసి బాధితులను పరామర్శించారు. ఇళ్లకు నేరుగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారికి మెరుగైన అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం పంచాయతీ అధికారులతో సమావేశమై మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో వీధి కుక్కల బెడదను నిర్మూలించే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.