ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ భారీ ప్రభావం
NEWS Nov 12,2025 02:59 pm
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి నితీశ్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 5 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అంచనా వేసినప్పటికీ, సీట్లు గెలవకపోయినా పార్టీ ఓట్ షేర్‌లో ప్రభావం మాత్రం బలంగా ఉంది. ఎన్డీయే వ్యతిరేక ఓట్లను ఈ పార్టీ చీల్చింది. దీనివల్ల ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమి తీవ్రంగా నష్టపోయింది. జన్ సురాజ్ ఓట్లు చీల్చడం వల్ల అంతిమంగా అధికార ఎన్డీయే కూటమికే ప్రయోజనం చేకూరిందని విశ్లేషకులు చెబుతున్నారు.