మల్లాపూర్ లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు వెనుక టైర్ల మధ్య బండరాయి ఇరుక్కోవడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపారు. ధాన్యంపై తాటి పత్రాలు కప్పి ఉంచిన బండరాయిని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సాయంతో రాయిని తొలగించారు. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.