రిచా ఘోష్ పేరిట క్రికెట్ స్టేడియం
NEWS Nov 11,2025 07:27 pm
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టు టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక సభ్యురాలైనా రిచా ఘోష్ కు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్‌లో రిచా ఘోష్ పేరిట క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర CM మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు. రిచా ఘోష్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ, దానికి రిచా ఘోష్ నామకరణం చేయనున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.