విజయ్ దేవరకొండ స్టేట్‌మెంట్ రికార్డ్
NEWS Nov 11,2025 06:19 pm
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ విచారణకు హాజరయ్యారు. నటుడి నుంచి స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు సీఐడీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు సీఐడీ విచారణకు హీరో హాజరయ్యారు.