దారి పూర్తి చేయాలని గిరిజనుల డిమాండ్
NEWS Nov 11,2025 06:26 pm
అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ బంధకొండ గ్రామ గిరిజనులు రహదారి పనులను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2024లో ప్రారంభమైన పనులు గుత్తేదారుడు మధ్యలో నిలిపివేయడంతో రహదారి అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు లేవన్నారు. ఇటీవల తుపాన్ వర్షాలతో మట్టిరోడ్డు గోతులు ఏర్పడి రవాణా దెబ్బతిందని, వెంటనే పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరారు.