అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి: సీఎం రేవంత్
NEWS Nov 11,2025 03:39 pm
కవి, జన వాగ్గేయకారుడు అందెశ్రీ మరణం పట్ల CM రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన సీఎం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అందెశ్రీకి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ పేరు నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.