ఢిల్లీ పేలుడు: వెలుగులోకి కీలక విషయాలు
NEWS Nov 11,2025 01:29 pm
ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగితోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674గా గుర్తించారు. ఇది మహమ్మద్ సల్మాన్ పేరు మీద రిజిస్టరై ఉంది. ఈ సమాచారం ఆధారంగా అధికారులు మహమ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాను ఆ కారును పుల్వామా నివాసి అయిన తారిక్‌కు అమ్మేసినట్టు సల్మాన్ విచారణలో తెలిపాడు. ఈ కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు, అన్ని కోణాల్లోనూ విచారణను వేగవంతం చేశాయి.