రాజకీయంగా జూబ్లీహిల్స్ పోలింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో పోలింగ్ శాతం మాత్రం తక్కువగా కనిపిస్తోంది. తొలి నాలుగు గంటల పోలింగ్ ముగిసే సమయానికి 20.76 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ వేళ నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటం పైన ఎన్నికల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ నేతల పరస్పర ఫిర్యాదులు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.