ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైఅలర్ట్
NEWS Nov 10,2025 11:49 pm
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, డెహ్రాడూన్.. వంటి అన్ని ప్రాంతాల్లో తనిఖీలను పెంచారు. ఢిల్లీ పేలుడు తర్వాత, ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. ఇండో-నేపాల్ బోర్డర్ వెంబడి సరిహద్దు భద్రతా దళం (BSF)తో పాటు, స్థానిక పోలీసులను కూడా మొహరించారు. హైదరాబాద్‌లోనూ పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాతబస్తీ అంతటా గస్తీ పెంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఢిల్లీ పేలుళ్ల నేపధ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా