హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన
NEWS Nov 10,2025 11:14 pm
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లపై హోంమంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. i20 కారులో పేలుడు జరిగిందని, ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు జరిగిందని ఆయన తెలిపారు. పేలుడు ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారని, పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించినట్లు అమిత్‌షా వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఢిల్లీ సీపీ సహా ఉన్నతాధికారులతో మాట్లాడానని, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించామని స్పష్టం చేశారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న LNJP హాస్పిటల్ కు అమిత్ షా వెళ్లారు. బాధితులకు ధైర్యం చెప్పారు.