దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ రెడ్‌లైట్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఓ కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.