15న మహేశ్-రాజమౌళి మూవీ ఈవెంట్
NEWS Nov 10,2025 07:00 pm
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ చిత్రం SSMB29 (గ్లోబ్‌ట్రాటర్) కోసం భారీ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. 50,000 మందికి పైగా ఫ్యాన్స్ వస్తారని అంచనా. దేశ సినీ చరిత్రలోనే అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్‌లలో ఒకటిగా ఇది నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్‌తో పాటు, 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.