నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
NEWS Nov 10,2025 06:47 pm
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రసారం చేశాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానళ్లు తన వీడియోలోని క్లిప్పింగులను తీసుకుని, దానికి రాజకీయ రంగు పులిమాయని, తాను కేవలం "అన్నప్రసాదం చాలా బాగుంది" అని మాత్రమే అన్నానని, కానీ ఆ ఛానళ్లు మాత్రం "గతంలో కంటే ఇప్పుడు బాగుంది" అని తాను అన్నట్లుగా ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఈ విధంగా తన ప్రశంసలను ప్రస్తుత టీటీడీ బోర్డుకు, దాని ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఆపాదిస్తూ ఆ మీడియా సంస్థలు 'శునకానందం' పొందుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.