వచ్చే 3 రోజులు చలి పులి పంజా!
NEWS Nov 10,2025 04:21 pm
తెలుగు రాష్ట్రాల ప్రజలపై చలి పులి పంజా విసురుతోంది. నవంబర్ నెలలో చలి విజృంభణ కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 11 నుంచి 19 వరకు అతి చల్లని గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.