జూబ్లీహిల్స్ పోలింగుకు ఏర్పాట్లు పూర్తి
NEWS Nov 10,2025 10:10 am
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉ.7 నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్‌లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, పోలింగ్ సరళిపై డ్రోన్ల ద్వారా నిఘా నిర్వహిస్తారు.