పవన్ పనితీరును ప్రశంసించిన చంద్రబాబు
NEWS Nov 10,2025 03:26 pm
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. మామండూరు అటవీ ప్రాంతం, ఎర్రచందనం డిపో సందర్శన వివరాలు పవన్ తెలిపారు. పవన్ చొరవను ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు, ఆయన పనితీరును ప్రశంసించారు. నేటి కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.