ప్రముఖ కవి అందెశ్రీ మృతిపై గాంధీ వైద్యులు సంచలన ప్రకటన చేశారు. ఆరోగ్యం విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యం చేశారని.. నెల రోజులుగా బీపీ మాత్రలు వేసుకోలేదని తెలిపారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే ఆయన చనిపోయారని.. కానీ గత కొద్దిరోజులుగా ఆయన మందులు వాడటం లేదని గాంధీ ఆస్పత్రి హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ తెలిపారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారని అన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదని.. ఉదయం కుటుంబ సభ్యులు అందెశ్రీని గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు హెచ్‌ఓడీ తెలిపారు.