ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీకి అంత్యక్రియలు
NEWS Nov 10,2025 10:13 am
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీకి అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 'జయ జయహే తెలంగాణ' అనే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని అందెశ్రీ రాశారు. 2006లో 'గంగ' సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితి పురస్కారం అందెశ్రీ అందుకున్నారు.