పేదవారికి 'రెడీ టు సర్వ్' అన్నదానం!
NEWS Nov 09,2025 06:44 pm
HYD: పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవ లను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహ కులు పెద్ది శంకర్ తెలిపారు. సేవ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు, సహకరించాలనుకునే వారు తమను సంప్రదించాలని కోరారు.