యాదగిరిగుట్టకు రికార్డుస్థాయిలో భక్తులు
NEWS Nov 09,2025 10:36 pm
యాదగిరిగుట్ట: కార్తికమాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇవాళ ఒక్కరోజే 78,200 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో రికార్డు స్థాయిలో.. దేవస్థానంలోని వివిద విభాగాల ద్వారా రూ.1.57 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు.