ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు!
NEWS Nov 09,2025 09:15 pm
ఏపీ క్యాబినెట్ భేటీ సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై క్యాబినెట్ చర్చిస్తారు. ఇప్పటికే ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను సీఎం మంత్రులు, అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు రూ. లక్ష కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.