సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడిని అదృష్టం వరించింది. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు పేద కుటుంబానికి చెందిన అనిల్ కుమార్. ఇటీవల యూఏఈలో తీసిన లాటరీలో ఆయనను రూ.240కోట్లు వరించాయి. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కొంత కాలంగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల తాను కొనుగోలు చేసిన టికెట్లలో తన తల్లి పుట్టినరోజుతో కూడిన లాటరీ నంబర్‌కు జాక్‌పాట్ తగిలి ధనలక్ష్మి ఆయన తలుపుతట్టింది.