జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారం
NEWS Nov 09,2025 02:07 pm
జూబ్లీహిల్స్‌లో 17 రోజులుగా హోరాహోరీగా సాగిన బైపోల్ ప్రచారం ముగిసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి రోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని ముగించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు జిల్లాల నుంచి వచ్చిన పార్టీల నాయకులందరూ తిరిగి వెళ్లిపోవాలని సూచనలు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.