మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
NEWS Nov 09,2025 06:57 pm
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోందన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలీదన్నారు. కేటీఆర్ ఆస్పత్రికి వచ్చేదాక మరణాన్ని ప్రకటించలేదన్నారు. ‘జూన్ 6న చనిపోయారా.. 8న చనిపోయారా?’ అన్నదీ సందేహంగానే ఉందన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు.