శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ నిజాలు
NEWS Nov 08,2025 10:48 pm
AP: తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ విచారణలో కీలక అంశాలు బయట పడుతున్నాయి. మోనో గ్లిజరాయిడ్స్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను వినియోగించి పామాయిల్‌గా మార్చి దాన్నే నెయ్యిగా లడ్డూ తయారీకి పంపారని సిట్ గుర్తించింది. బోలే బాబా డెయిరీలో తయారైన నెయ్యిలో 90% పామాయిల్ ఉన్నట్లు కనుగొంది. సబ్ కాంట్రాక్టర్ అజయ్ కుమార్, బోలే బాబా కంపెనీ కలిసి అక్రమాలకు పాల్పడినట్లు సిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కెమికల్స్ అమ్మకంతో కోట్లలో ఆదాయం పొందినట్లు అజయ్ కుమార్ ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్టులో సిట్ పొందుపర్చింది.