కోటి దీపోత్సవాన్ని అధికారికంగా
నిర్వహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
NEWS Nov 08,2025 07:32 pm
హైదరాబాద్: భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు. కోటి దీపోత్సవాన్ని జాతీయ పండగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా హాజరైన రేవంత్ రెడ్డి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.