హైడ్రాపై 700 కేసులు, నాపై 31 కేసులు
NEWS Nov 08,2025 09:57 pm
ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, కుంటల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రాపై 700 కేసులు నమోదు కాగా.. తను వ్యక్తిగతంగా 31 కంటెంప్ట్ కేసులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.55 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కాపాడిన తెలిపారు. మొత్తం 181 డ్రైవ్స్‌లో 954 కబ్జాలు తొలగించామని, వెయ్యి 45 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వర్షాకాలంలో హైడ్రా టీమ్ 96 వేల 972 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. క్యాచ్‌పిట్స్ క్లీనింగ్ 56 వేల330 – నాళాల క్లీనింగ్ 6 వేల721 పూర్తయినట్లు తెలిపారు.