ప్రపంచంలోనే ప్రభావవంతమైన వ్యక్తిగా కోహ్లీ
NEWS Nov 08,2025 09:50 pm
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. ప్రముఖ సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ 'హైప్‌ఆడిటర్' విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. క్రికెట్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు, తన వ్యక్తిగత జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.