గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయండి
NEWS Nov 08,2025 01:53 pm
కూనవరం (మం) పెద్దఅర్కూర్ పంచాయతీ పరిధిలోని గండి కొత్తగూడెం గ్రామానికి తారు రోడ్డు కోసం నిధులు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు నాగమణి డిమాండ్ చేశారు. శనివారం గ్రామ శాఖ కార్యదర్శి తొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గూడెం కొత్త వీధి, పివిటిజి గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం కలెక్టర్, పిఓలకు పలు సార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయకపోతే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.