డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు
NEWS Nov 08,2025 04:28 pm
ఢిల్లీ : డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.