నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యం: సుజిత్ రావు
NEWS Nov 08,2025 04:46 pm
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని టిపిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. ఎల్లారెడ్డిగూడలో మంత్రి శ్రీధర్ బాబు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యేతో కలిసి తన అనుచరులతో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముస్లిం మత పెద్దను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పాటుపడుతుందని.నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.