కథలాపూర్ లో ఆకస్మిక తనిఖీలు
NEWS Nov 08,2025 02:38 pm
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కథలపూర్ మండల పరిధిలోని సమస్యత్మాక ప్రదేశాలతో పాటు రద్దీ ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మికంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలో గంజాయి లాంటి పదార్థాలను నిర్మూలించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ అనునిత్యం అప్రమత్తతతో పని చేస్తుందని, దీని కోసం ప్రజలు పోలిస్ శాఖ వారికి సహకరించాలని ఎస్ఐ నవీన్ కుమార్ కోరారు. మండల పరిధిలోని పాన్ షాప్, కిరాణా షాప్ లలో, బస్టాండ్ ప్రాంతాల్లో, రద్దీ గల ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు.