తెలంగాణ: 23 జిల్లాలను వణికిస్తున్న చలి
NEWS Nov 08,2025 10:30 am
తెలంగాణ ప్రజలను చలి వణికిస్తోంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపై కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని, శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు