116 ఏళ్ల వృద్ధురాలి హెల్త్ సీక్రెట్ ఇదే!
NEWS Nov 07,2025 07:58 pm
ప్రపంచంలోనే 116 ఏళ్ల అత్యంత వృద్ధురాలు ఎథెల్ క్యాటర్‌హామ్, తన సుదీర్ఘ జీవిత రహస్యాన్ని వెల్లడించారు. ఎవరితోనూ వాదించకుండా, మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించడమే తన ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు మూలమని ఆమె తెలిపారు. "నేను ఎవరితోనూ వాదించను. వాళ్లు చెప్పేది వింటాను, కానీ నాకు నచ్చినట్టే చేస్తాను" అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1909 ఆగస్టు 21న ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించిన ఎథెల్ ను, ఈ ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలిగా గుర్తించింది.