వీళ్లేం సెలబ్రిటీలు?: క్రికెటర్ లపై సజ్జనార్ ఫైర్
NEWS Nov 07,2025 05:59 pm
క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో వీరికి చెందిన ₹ 11 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆ న్యూస్ ను తన X అకౌంట్ లో షేర్ చేసిన సజ్జనార్, "వీళ్ళేం సెలబ్రిటీలు? అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీరు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కి ఎంతో మంది బలయ్యారని, సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రోత్సహించిన ఈ క్రికెటర్లు కూడా బాధ్యులేనని అన్నారు.