ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియం
NEWS Nov 07,2025 04:57 pm
హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. చారిత్రక లార్డ్స్, సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి దిగ్గజ స్టేడియాలకు తీసిపోని విధంగా ఫ్యూచర్ సిటీలో రెండేళ్లలో దీన్ని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనిపై అధ్యయనానికి మాజీ క్రికెటర్లతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రవాణా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసే అవకాశముంది.