వందేమాతరానికి 150 ఏళ్లు
NEWS Nov 07,2025 06:01 pm
వడ్డాది గ్రామం NTS స్కూల్లో జాతీయగీతం వందేమాతరానికి 150 సంవత్సరాల ఆయన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం NTS స్కూల్లో వందేమాతరంకు 150 ఏళ్లు అనే అంశంపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన వక్తృత్వ, పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూలు కరస్పాండెంట్ V వి .రామరాజు మాట్లాడుతూ వందేమాతరం భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి, వందేమాతర గేయం దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని విద్యార్థులకు తెలిపారు. G శ్రీనివాసరావు, మిగతా ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు