9న వడ్డాదిలో ఉచిత వైద్య శిబిరం
NEWS Nov 07,2025 03:39 pm
ఈనెల 9న వడ్డాది పెద్ద బజారు వీధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వడ్డాది టీడీపీ టౌన్ అధ్యక్షులు దొండా నరేశ్ తెలిపారు. విశాఖ, అనకాపల్లి నుంచి స్పెషలిస్ట్ వైద్యులు శిబిరానికి వస్తారన్నారు. ఉచితంగా జనరల్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి, మందులు అందిస్తారని చెప్పారు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసి వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తారన్నారు.