మాకు మంచినీటి సౌకర్యం కల్పించండి!
NEWS Nov 07,2025 03:38 pm
అనంతగిరి (మం) పినకోట పంచాయతీ పరిధిలో గల వెలగలపాడు గ్రామస్తులు మంచినీళ్లు సౌకర్యం కల్పించాలని శుక్రవారం డిమాండ్ చేసారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లు పూర్తిగా పాడైపోయాయన్నారు. తాగు నీరు కోసం అష్ట కష్టాలు పడుతున్నామని వాపోయారు. దిక్కు లేక తాగునీరు కోసం కలుషితమైన గెడ్డ నీరు పైనే ఆధార పడాల్సి వస్తుందన్నారు. దీంతో అనేక జబ్బుల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని గిరిజనులు వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.