టీ20 వరల్డ్ కప్ 2026 వేదికలు ఖరారు
NEWS Nov 07,2025 12:49 pm
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక వేదికలను ఖరారు చేసింది. భారత్‌లో 5 ప్రధాన నగరాలను, శ్రీలంకలో 2 వేదికలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్‌లో అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలను మ్యాచ్‌ల నిర్వహణకు ఎంపిక చేశారు.